Top
logo

కాంగ్రెస్‌లా కాదు.. వందకు వందశాతం రుణమాఫీ : సీఎం

కాంగ్రెస్‌లా కాదు.. వందకు వందశాతం రుణమాఫీ : సీఎం
Highlights

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చాం రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీని వందకు వందశాతం రూ. లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చాం రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. అదే కాంగ్రెస్ పార్టీ ఏకమొత్తంలోనే రూ. 2 లక్షలు మాఫీ చేస్తాం అన్నారు అయినా తెలంగాణ ప్రజల విశ్వాసం తమవైపే ఉందన్నారు కేసీఆర్. ఇగ ఇదే కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో చెప్పింది ఎదీ? ఇప్పడి వరకు కూడా అక్కడ అమలు కాలేదని కేసీఆర్ గుర్తుచేశారు. మొన్ననే కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు ఉత్త సంతకాలు తప్ప ఇంత వరకు ఒక్క చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదని అన్నారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు వారికే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల బాధ్యతలు అప్పజెప్పుతామన్నారు. కంటి వెలుగు ఆపరేషన్లు చేయలేదని కేవలం పరీక్షలు అద్దాలు మాత్రమే ఇచ్చామని చెప్పారు కేసీఆర్.

Next Story

లైవ్ టీవి


Share it