రైతుబంధు కోసం అప్పు?

రైతుబంధు కోసం అప్పు?
x
Highlights

రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పెంచిన రైతుబంధు మొత్తాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతికి నిధులు సమకూర్చేందుకు సిద్ధమవుతోంది.

రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పెంచిన రైతుబంధు మొత్తాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతికి నిధులు సమకూర్చేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఓ ఆర్థిక సంస్థ నుంచి రుణం పొందేందుకు ఈ నెల 11న అధికారుల బృందం ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు కావాల్సిన భారీ మొత్తాలను సేకరించడం అధికారులకు భారంగా మారింది. పెండింగ్ బిల్లులకు డబ్బులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. ఒక్క రైతు బంధు పథకానికి రెండో విడతలో చెల్లించాల్సిందే 500 కోట్లు పెండింగ్ ఉంది. ఇక పెన్షన్, నిరుద్యోగ భృతి లాంటి వాటికి మరింత నిధుల కొరత ఉండటంతో రుణాల కోసం ప్రయత్నిస్తోంది సర్కార్.

అయితే, ఆర్థిక క్లిష్ట పరిస్థితి నుంచి ఈ రుణం గట్టెక్కించగలదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రుణం అందితే నిలిచిపోయిన రైతు బంధు చెల్లింపులు మొదలు కావొచ్చని భావిస్తున్నారు. గత ఖరీఫ్, ప్రస్తుత రబీ సీజన్‌లో ఎకరానికి 4వేల చొప్పున ప్రభుత్వం రైతు బంధు నగదును పంపిణీ చేసింది. ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఎకరానికి 5వేలు చొప్పున ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో వచ్చే బడ్జెట్‌లో 15వేల కోట్లుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది సర్కార్.

రాష్ట్రంలో రోజుకు సగటున 40 మంది రైతులు చనిపోతున్నట్టు తెలంగాణ వ్యవసాయశాఖ విడుదల చేసిన బీమా నివేదికలు చెబుతున్నాయి. 2017 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి రైతు బీమా మొదలుకాగా ఇప్పటి వరకు 146 రోజుల వ్యవవధిలో 5వేల 821 మంది మృతి చెందారు. అంటే సగటున 40 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో 5వేల 525 మంది రైతు నామినీ అకౌంట్లలో 5లక్షల రూపాయల చొప్పున నగదు జమ అయ్యింది. అయితే, రబీలో కొత్తగా చేరిన 2.28లక్షల మంది, ఖరీఫ్‌లో మిగిలిపోయిన 1.92లక్షల మందికి కలిపి 500 కోట్ల రూపాయల పెట్టుబడి అందాల్సి ఉంది. దీంతో డబ్బులు ఖాతాలో పడని రైతులంతా వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మరి ఈ రైతులందరికీ రైతుబంధు ఎప్పుడు అందుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories