రెండు రోజులు.. మద్యం దుకాణాలు బంద్‌

రెండు రోజులు.. మద్యం దుకాణాలు బంద్‌
x
Highlights

ఎన్నికల్లో మద్యం ప్రవాహం అడ్డుకునేందుకు ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకోంది. మద్యం విక్రయాలపై ఫోకస్ పెట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. మద్యం తరలింపు, భారీ...

ఎన్నికల్లో మద్యం ప్రవాహం అడ్డుకునేందుకు ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకోంది. మద్యం విక్రయాలపై ఫోకస్ పెట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. మద్యం తరలింపు, భారీ స్థాయిల్లో కొనుగోళ్లపై నిఘా పెంచారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి గురువారం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే యత్నాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది. మద్యం విక్రయాలకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలని, ఏరోజు కారోజు మద్యం క్రయ, విక్రయాల వివరాలను సమర్పించాల్సిందిగా ఈసీ ఆబ్కారీశాఖను ఆదేశించింది. మద్యం లెక్కలపై ఆబ్కారీ అధికారులు పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపే మద్యం దుకాణాలపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. 11న జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మద్యం, మత్తు పదార్థాల రవాణాపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు చోట్ల గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను పట్టుకున్న అధికారులు అక్రమ మద్యం విక్రయాలు, రవాణాపై దాడులు జరిపి అక్రమ మద్యం సీజ్ చేశారు. ఎన్నికల యాక్షన్‌ప్లాన్‌లో భాగంగా ఫలితాలు వెలువడే వరకు 24/7 పనిచేసే విధంగా ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు.

రాష్ర్ట సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పన్ను చెల్లించకుండా ఇతర ప్రాంతాల నుంచి మద్యం తరలించడం, నకిలీ మద్యం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అక్రమంగా మద్యం తరలించకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు, రూట్‌వాచ్, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 నుంచి గురువారం సాయంత్రం 6గంటల వరకు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. ఈ ఆంక్షలు వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు, అన్ని రకాల మద్యం సరఫరాచేసే హోటళ్లకు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. నిషేధిత రోజుల్లో ఎవరైన మద్యం విక్రయాలకు పాల్పడితే వారి లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు ఎన్నికల నియమావళి ఉల్లంఘన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆబ్కారీ, పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అడ్డగోలుగా మద్యం కొనుగోలు చేసుకోకుండా ఈసీ ఆంక్షలు విధించింది. ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా మద్యం కొనుగోలు చేసినా, నిల్వ చేసుకున్నా వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories