బీమా సొమ్ము కోసం..190 మందిని బతికుండగానే చంపేశారు

బీమా సొమ్ము కోసం..190 మందిని బతికుండగానే చంపేశారు
x
Highlights

సూర్యాపేట జిల్లా కోదాడ ఎల్ఐసీ ఆఫీసులో బీమా కోసం జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 190 మంది పాలసీదారులు చనిపోయినట్టు నకిలీ డెత్ సర్టిఫికెట్లను...

సూర్యాపేట జిల్లా కోదాడ ఎల్ఐసీ ఆఫీసులో బీమా కోసం జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 190 మంది పాలసీదారులు చనిపోయినట్టు నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించి సుమారు 3కోట్ల 14లక్షల వరకు స్వాహా చేశారు. ఎల్ఐసీ అంతర్గత తనిఖీల్లో ఈ భారీ స్కామ్ బయటపడింది. పాలసీ కట్టలేని వారి బాండ్లను సేకరించి, నకిలీ డెత్ సర్టిఫికెట్లతో బీమా మొత్తాన్ని క్లైమ్ చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బానోతు బికు నాయక్ తో పాటు ఎల్ఐసీ ఉద్యోగి హరియా, మరికొందరు ఎల్ఐసీ ఎజెంట్లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

ఎల్‌ఐసీ పాలసీ తీసుకుని సకాలంలో ప్రీమియం చెల్లించలేనివారే ఆ గ్యాంగ్‌ టార్గెట్‌. ఇలా పాలసీ కట్టలేని వారిని గుర్తించి, వారి వద్ద నుంచి బాండ్‌ పేపర్లు తీసుకుంటారు. ఇక అక్కడి నుంచి వారి అసలు దందా మొదలవుతుంది. ఆ పాలసీదారులు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ల సృష్టిస్తారు. బీమా మొత్తాన్ని క్లెయిమ్‌ చేయించి, స్వాహా చేస్తారు. గడిచిన ఆరేళ్లలో ఈ గ్యాంగ్ ఏకంగా 3కోట్ల14 లక్షల మేర స్వాహా చేసింది. ఎల్ఐసీ అంతర్గత తనిఖీల్లో మోసాన్ని గుర్తించిన అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

సూర్యాపేట జిల్లా కోదాడ శాఖ ఎల్‌ఐసీ ఆఫీసులో బానోత్‌ బికూ నాయక్‌ ఏఏఓగ పనిచేస్తున్నాడు. ఇతను తన వద్ద పనిచేసే గుమస్తా గుగులోత్‌ హరియాతో పాటు తొమ్మిది మంది ఎల్‌ఐసీ ఏజెంట్లతో కలిసి ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. గత ఐదారు నెలలుగా ప్రీమియం చెల్లించని పాలసీదారులను ఈ గ్యాంగ్‌ టార్గెట్ చేసుకుంది. బికూ నాయక్‌, హరియాలు ఇలాంటి వారి లిస్ట్ ను ఏజెంట్లకు అందజేశారు. ఈ గ్యాంగ్ లోని ఎల్ఐసీ ఎజెంట్లు వెంటనే సంబంధిత పాలసీదారుల వద్దకు వెళ్ళేవారు. పాలసీదారుల నుంచి బాండ్‌ పేపర్లు తీసుకునేవారు. సదరు పాలసీదారు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లను సృష్టిస్తారు. తామే వారి కుటుంబ సభ్యులమంటూ క్లెయిమ్‌ డబ్బులను స్వాహా చేస్తారు.

గడిచిన ఆరేళ్లలో ఈ గ్యాంగ్ 3కోట్ల14లక్షల మేర స్వాహా చేసింది. కొన్ని ఖాతాల్లోకే క్లెయిమ్‌ సొమ్ము జమ అవుతుండటాన్ని అంతర్గత తనిఖీల్లో గుర్తించిన కోదాడ ఎల్ఐసీ బ్రాంచ్‌ మేనేజరు జరిగిన మోసాన్ని గుర్తించి, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ ఈ ముఠా గడిచిన ఆరేళ్లలో 190 పాలసీదారులను బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని, ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. నిందితులపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరికొందరి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories