చిరుత బీభత్సం...జనానికి ముచ్చెమటలు పట్టించిన చిరుత

చిరుత బీభత్సం...జనానికి ముచ్చెమటలు పట్టించిన చిరుత
x
Highlights

పంజాబ్‌లో ఓ చిరుత చుక్కలు చూపించింది. పట్టపగలే ఇళ్ల మధ్య తిరుగుతూ ముచ్చెమటలు పట్టించింది. మెరుపు వేగంతో జనాలపైకి దూసుకెళ్లి హడలెత్తించింది. చివరకు...

పంజాబ్‌లో ఓ చిరుత చుక్కలు చూపించింది. పట్టపగలే ఇళ్ల మధ్య తిరుగుతూ ముచ్చెమటలు పట్టించింది. మెరుపు వేగంతో జనాలపైకి దూసుకెళ్లి హడలెత్తించింది. చివరకు పట్టుకునేందుకు యత్నించినా ఎవరి చేతికి చిక్కకుండా గోళ్లతో రక్కేసింది.

జలంధర్ పట్టణ శివారులోని అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన చిరుత ప్రజలను వణికించింది. గల్లీ గల్లీ తిరుగుతూ నానా బీభత్సం చేసింది. సెకన్లలో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి క్షణాల్లో దూకడం మొదలుపెట్టింది. దీంతో ఇళ్లల్లోని మహిళలు, ముసలివారు సైతం ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. చిరుత చేస్తున్న వీరంగానికి భయపడ్డ స్ధానికులు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందజేశారు

జెట్‌ స్పీడ్‌తో ఘటన స్ధలానికి చేరుకున్న ఫారెస్ట్‌ అధికారులు చిరుత పట్టుకునేందుకు వల వేశారు. వలకు చిక్కకుండా తప్పించుకున్న చిరుత కనిపించిన వారిపై పంజా విసురుతూ తన ప్రతాపం చూపింది. పట్టుకునేందుకు యత్నించినా ఎవరికి చిక్కకుండా వీధుల్లో పరుగులు పెట్టింది. దీంతో చిరుత దూకుడుకు భయాందోళన చెందిన జనాలంతా ఒక్క చోట పోగయ్యారు.

గంటల తరబడి చిరుతను పట్టుకునేందుకు స్ధానికులు, అధికారులు కుస్తీపట్టారు. కర్రలు, రాళ్లతో దాడి చేస్తూ అక్కడి నుంచి తరిమేసేందుకు యత్నించారు. అయినా ఎవరికి చిక్కకుండా దాడి చేయడం మొదలు పెట్టడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో చివరకు ట్రాంక్విలైజర్స్ ఉపయోగించి చిరుతను పట్టుకుని చాట్ బీర్ జూకు తరలించారు. పరుగులు పెట్టించిన చిరుతను పట్టుకోవడంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories