వైసీపీలోకి నేతల ఓవర్ ఫ్లో.. జగన్‌కి లాభిస్తుందా? చేటు చేస్తుందా?

వైసీపీలోకి నేతల ఓవర్ ఫ్లో.. జగన్‌కి లాభిస్తుందా? చేటు చేస్తుందా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది కాని మరీ ఆ పార్టీకి చేటు తెస్తుందా? వరుసగా వలస నేతలను...

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది కాని మరీ ఆ పార్టీకి చేటు తెస్తుందా? వరుసగా వలస నేతలను ప్రోత్సహించడంతో ఏండ్ల తరబడి పార్టీనే నమ్ముకున్న వారిలో అసంతృప్తి మొదలైందా? ఇన్నాళ్లుగా పార్టీలో కంటికి రెప్పల కపాడుకుంటూ వస్తున్న వారిని కాదని ఇప్పుడిప్పుడే కొత్తగా పార్టీలోకి చేరుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం సిట్టింగ్ ఎమ్మెల్యేలలోనూ తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. వలస నేతలకు న్యాయం చేసే క్రమంలో తనను నమ్ముకున్న వారిని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దూరం చేసుకుంటారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

తాజాగా కాకినాడ ఎంపి తోట నరసింహం, ఆయన సతీమణి తోట వాణి, విజయవాడ మాజీ మేయర్ రత్న బిందు,పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్, సినీ నటుడు రాజా రవీంద్ర సహా పలువురు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరందరికి జగన్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు సినీ నటుడు అలీ వైసీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో ఆయన పార్టీ అధినేత జగన్‌ను కలిసి పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.

అయితే గత 2014 సంత్సరంలో కంటే ఈసారే ఏపీలో టీడీపీతో పోలిస్తే వైసీపీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరుపున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఏపీ మొత్తంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీలోకి టీడీపీ, కాంగ్రెస్, జనసేన వంటి పార్టీల నుండి వైసీపీ గూటికి చేరుతున్న నేతలతో బయటకు అంతా పాజిటివ్‌గా ఉందన్నట్లుగా కనిపిస్తోన్న కాని అంతర్గతంగా మాత్రం ఖచ్చితంగా అసంతృప్తి సేగలు మాత్రం రేగే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు.

అయితే అసంతప్తులను జగన్ తో పాటు వైసీపీ కీలక నేతలు బుజ్జగిస్తుండగా అక్కడక్కడ మాత్రం అసంతృప్తులు భగ్గుమంటున్నారు. సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆశావహులు టిక్కెట్ల కోసం పార్టీ ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడికక్కడ నేతలు నిరసనలకు దిగుతున్నారు. చివరికి లోటస్ పాండ్‌ను కూడా వదిలిపెట్టడంలేదు. ఏకంగా జగన్ నివాసం ముందే ఆందోళనలు నిర్వహించారు. అయితే ఎన్నికల నాటికి ఈ ప్రభావం మరింత పెరగవచ్చేనే సంకేతాలు వెలువడుతున్నాయి.

కీలక సమయంలో పార్టీని నమ్మకున్న నేతలను కాదని కేవలం గెలుపు గుర్రాల పేరిట ఫిరాయింపు దారుల్ని, కొత్త నేతలను వైసీపీలోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది కొంత వరుకు మాత్రం వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశమే అయినా వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోనట్లే కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories