logo

ఎన్టీఆర్‌ ఘాట్‌ను పట్టించుకోవడం లేదు

Lakshmi ParvathiLakshmi Parvathi

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 22వ వర్ధంతి సందర్భంగా...ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సతీమణి, వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి నివాళి అర్పించారు. అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఎప్పటికి తెలుగు వారి గుండెల్లో ఆరాధ్యుడే అని కొనియాడారు. కానీ తన గుండెల్లో మంట చల్లారలేదని.. కళ్లలో నీరు ఇంకా ఇంకలేదని ఆవేదనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ఆత్మ శాంతించలేదని.. ఆయన ఆత్మ ఘోషిస్తుందని వాపోయారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ను సరిగా పట్టించుకోవడం లేదని పెచ్చులూడుతున్నాయని తెలిపారు. ఇది ఎన్టీఆర్‌కు అవమానం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయాన్ని గమనించి ఘాట్‌కు మరమ్మతులు చేయించాలని కోరారు.

లైవ్ టీవి

Share it
Top