నా మనవడికి 'మంగళగిరి' అనటం కూడా రాదు

నా మనవడికి మంగళగిరి అనటం కూడా రాదు
x
Highlights

ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న లీడర్‌లలో అగ్రస్థానంలో ఉండే నాయకుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్. అవగాహన రాహిత్యం...

ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న లీడర్‌లలో అగ్రస్థానంలో ఉండే నాయకుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్. అవగాహన రాహిత్యం కొంత అయితే అసలు తాను ఏం మాట్లాడాల్లో కూడా ముందుగా ప్రిపేర్ కాకపోవడమే మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేస్తునే ఉన్నాడు లోకేశ్. కాగా తన వీడియోలు సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నా విషయం అందరికి తెలిసిందే. ఇక దీంతో నారా లోకేశ్ ప్రతిపక్షాలు లోకేశ్ బాబు ఓ రేంజ్ అడిపోసికుంటున్న విషయం తెలిసిందే.

కాగా లోకేశ్ బాబును అడిపోసుకుంటున్న జాబితాలో తాజాగా లక్ష్మీపార్వతి కూడా చేరారు. లోకేష్‌కు లక్ష్మీ పార్వతి వరుసకు అమ్మమ్మ అవుతారు. దీంతో తన మనవడికి మంగళగిరి అని పలకడం రాక మందళగిరి అని అంటున్నాడని లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. తాను మంగళగిరిని చాలా స్పష్టంగా పలుకుతున్నానని పలికి చూపించారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బుధవారం మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆర్కే తరపున ప్రచారం నిర్వహించారు లక్ష్మీ పార్వతి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూ. 60 లక్షలు ఖర్చుపెడితేనే లోకేష్ కు ఒక డిగ్రీ వచ్చిందని ఇప్పుడు ఇక తెలుగుభాషని సరిగ్గా ఉచ్చరించడానికి రూ.10 లక్షలు ఖర్చుపెడుతున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories