Top
logo

130 సీట్లతో..జగన్‌ సీఎం అవ్వడం ఖాయం: లక్ష్మీ పార్వతి

130 సీట్లతో..జగన్‌ సీఎం అవ్వడం ఖాయం: లక్ష్మీ పార్వతి
X
Highlights

ఏపీలో పొలింగ్ దగ్గరపడే కొద్ది రాజకీయాల రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు ఎన్నికల ప్రచార బరిలో దిగి నువ్వానేనా...

ఏపీలో పొలింగ్ దగ్గరపడే కొద్ది రాజకీయాల రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు ఎన్నికల ప్రచార బరిలో దిగి నువ్వానేనా అన్నంతగా ప్రచారంలో దూస్తుపొతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం ఎవరుఅనేది ఇప్పటి కొంత మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న విషయం తెలిసిందే కాగా తాజాగా వైసీపీపై లక్ష్మీ పార్వతి ముందుగానే జోస్యం చెప్పేశారు. ఏపీలో ఫ్యానుగాలి వీస్తోందని 130 సీట్లు గెలిచి భారీ మెజార్టీతో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వటం ఖాయమని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు.

పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉభయగోదావరిలో గతంలో కంటే ఈసారి భారీగా సీట్లను సాధిస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలు, చౌకబారు రాజకీయాలు మానవ చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయి వచ్చాడని చంద్రబాబును విమర్శించారు. వ్యక్తిగత డేటాను లీక్‌ చేయించి, అశోక్‌ అనే వ్యక్తిని దాచింది చంద్రబాబే అని ఆరోపించారు.

Next Story