ఏపీ ఫలితాలపై లగడపాటి సర్వే వర్కవుట్ అవుతుందా?

ఏపీ ఫలితాలపై లగడపాటి సర్వే వర్కవుట్ అవుతుందా?
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే వివరాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు సైకిల్‌, తెలంగాణ ఓటర్లు...

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే వివరాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు సైకిల్‌, తెలంగాణ ఓటర్లు కారు ఎక్కారన్నారని చెప్పారు. అయితే, లగడపాటి సర్వే ఒక్కటే, జాతీయ సర్వేలకన్నా భిన్నంగా ఉండటం.. తెలుగు ప్రజల్లో కొంత ఉత్కంఠను రేపుతోంది. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగినప్పటికీ.. టీడీపీదే గెలుపు అని లగడపాటి స్పష్టం చేశారు. వైసీపీ గట్టిపోటీ ఇచ్చిందని తెలిపారు. టీడీపీకి 90 నుంచి 110 స్థానాలు వస్తాయని చెప్పారు. వైసీపీకి 65 నుంచి 79 సీట్లు వస్తాయని తెలిపారు. జనసేన, ఇతరులకు కలిపి మూడు నుంచి రెండు సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే రెండు పార్టీల మధ్య ఉంటుందని అన్నారు. టీడీపీకి ఇంచుమించు 43 శాతం ఓట్లు వస్తాయని.. వైసీపీకి 41శాతం, జనసేనకు 11శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ ఓట్ల శాతంలో ఒక శాతం అటూఇటుగా ఉంటుందని చెప్పారు.

ఏపీలో లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి 13 నుంచి 17 సీట్ల వరకు వస్తాయని లగడపాటి తెలిపారు. వైసీపీకి 8 నుంచి 12 స్థానాలు రావొచ్చని అంచనా వేశారు. జనసేన, ఇతరులకు సున్నా నుంచి ఒక లోక్‌సభ స్థానం వచ్చే అవకాశం ఉన్నట్టు తమ సర్వేలో తేలిందన్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరగడం కలిసి వచ్చాయని.. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీనే మళ్లీ పవర్ లోకి రానుందన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు 14 నుంచి 16 లోక్‌సభ స్థానాలు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్‌కు 0 నుంచి రెండు స్థానాలు వస్తాయని ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ అధికారంలోకి రాకపోయినా గణనీయమైన ప్రజామద్దతుతో గట్టిపోటీ ఇచ్చింది లగడపాటి తెలిపారు. జనసేన మూడో స్థానంలో నిలవనుందని చెప్పారు. ఇంతకు లగడపాటి సర్వే వర్కవుట్ అవుతుందా? లేదా అన్నది మరో మే 23 వరకు వేచి చూడాల్సిందే. ఒక వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సర్వేల లాగా ఫట్ అవుతే లగడపాటి పరిస్థితి ఎంటి? పూర్తిగా తన సర్వేలను బంద్ పెట్టుకుంటారా ? లేక మరేమైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories