Top
logo

సర్వే ఫలితాలు ఆ రోజున వెల్లడిస్తా: లగడపాటి

సర్వే ఫలితాలు ఆ రోజున వెల్లడిస్తా: లగడపాటి
Highlights

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలను మే 19న వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి స్పష్టం చేశారు. ఈ ఉదయం...

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలను మే 19న వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి స్పష్టం చేశారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అనుభవజ్ఞులకే ప్రజలు పట్టం కడతారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఏపీ భవిష్యత్తు కోసం అనుభవజ్ఞుల అవసరం ఎంతైనా ఉందని, ఓటేసేముందు అభివృద్ధి, సంక్షేమం రెండిటినీ ప్రజలు చూస్తారని చెప్పారు. మే 19న తుది విడత ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు.

Next Story