ఏపీ ఎగ్జిట్‌పోల్ ఫలితాలను లగడపాటి ఆరోజే విడుదల చేస్తారంటా..

ఏపీ ఎగ్జిట్‌పోల్ ఫలితాలను లగడపాటి ఆరోజే విడుదల చేస్తారంటా..
x
Highlights

ఏపీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా కానీ ఏపీ ఫలితాలపైనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 19న ఏపీ...

ఏపీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా కానీ ఏపీ ఫలితాలపైనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 19న ఏపీ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెల్లడిస్తానని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. అయితే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పకుండా, అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తూ, పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లదే హవా అని తేల్చేసి, సెన్సేషన్‌ చేసిన విషయం తెలిసిందే చివరికి అర్టర్ ఫ్లప్ అయినా సంగతి కూడా తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తన సర్వే ఎందుకు లెక్క తప్పిందో కూడా వచ్చే నెల 19న చెబుతానని రాజగోపాల్‌ స్పష్టం చేశారు.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్టంలో ఎన్నారై టీడీపీ మీట్ & గ్రీట్ కార్యక్రమం జరిగింది. మిల్ పిటాస్‌లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ జాతీయ మీడియా కమిటీ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఎల్. వి.ఎస్. ఆర్. కె మాట్లాడుతూ ఏపీలో తెలుగుదేశం పార్టీ 130 సీట్లకుపైగా గెలుస్తుందని, మళ్లీ నారా చంద్రబాబు నాయుడే సీఎం అవడం ఖాయమని ప్రసాద్‌ అన్నారు. అయితే టీడీపీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories