ప్రయాగలో మొదలైన కుంభమేళా

Kumbh Mela 2019
x
Kumbh Mela 2019
Highlights

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి మార్చి నాలుగు వరకు జరిగే ఈ కుంభమేళ కోసం యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం విదేశాల నుంచి తరలివచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక సదుపాయలు కల్పించింది.

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. నేటి నుంచి మార్చి నాలుగు వరకు జరిగే ఈ కుంభమేళ కోసం యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం విదేశాల నుంచి తరలివచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక సదుపాయలు కల్పించింది.

ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రయాగ్‌రాజ్‌ అర్ధ కుంభమేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి సంక్రాంతి నుంచి మహా శివరాత్రి వరకు సాగే ఈ కుంభమేళాకు కనీవినీ ఎరుగని రీతిలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లు చేసింది. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ అర్ధ కుంభమేళాలో సాధారణ భక్తులతోపాటు వీఐపీలు, వీవీఐపీలు, ఎన్నారైల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ సర్కారు ప్రకటించింది. అలహాబాద్‌ను పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి అర్ధ కుంభమేళా కావడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేసింది. ఈ కుంభ మేళాను అపురూపమైన సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా యునెస్కో గుర్తించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. గడచిన మూడు నెలలుగా ప్రచారాన్ని హోరెత్తించిన యోగి సర్కార్ ఈ కుంభమేళాలో 12 కోట్ల మంది పాల్గొనే అవకాశముందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 6 లక్షల గ్రామాలున్నాయని ఈ గ్రామాల నుంచి కనీసం ఒక్కొక్కరైనా ఈసారి అర్ధ కుంభమేళాకు హాజరవ్వాలని యోగి సర్కార్‌ పిలుపునిచ్చింది.

కుంభ మేళకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గంగ, యమున నది ఒడ్డున 100 హెక్టార్లలలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో 'టెంట్‌ సిటీ'ని నిర్మించింది. 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 తాత్కాలిక వంతెనలు, 50 వేల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసింది. ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా 1.25 లక్షల టాయిలెట్స్‌ను నిర్మించింది. ఇదే సమయంలో నిరంతరం విద్యుత్ అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనుకోకుండా విద్యుత్ వ్యవస్ధకు అంతరాయం ఏర్పడితే అటోమెటిక్ సిస్టం ద్వారా ఆన్ అయ్యే 8 వందల జనరేటర్లను సిద్ధం చేసింది. కుంభమేళా జరిగే ప్రాంతం పరిశుభ్రంగా ఉండటం కోసం 20వేల చెత్తడబ్బాలను ఏర్పాటు చేశారు.

కుంభ మేళాకు 71 దేశాల ప్రతినిధులు హాజరువుతారని ప్రకటించిన యోగి సర్కార్ వీరి కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసింది. ఈ మార్గంలో ఇతర వాహనాలు రాకుండా నిషేధ ఆజ్ఞలు విధించింది. వీటితో పాటు కుంభమేళలో వాతావరణ పరిస్ధితిని ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఢిల్లీలో వాతావరణ శాఖ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు కుంభ మేళాకు చెందిన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు దూరదర్శన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వంద హెక్టార్ల పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక స్నాన ఘట్టాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో సుశిక్షితులైన ఈతగాళ్లను సిద్ధం చేసింది. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నిత్యం భద్రతను సమీక్షించేలా పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories