Top
logo

టార్గెట్‌ హస్తిన..

టార్గెట్‌ హస్తిన..
Highlights

టార్గెట్‌ 16 నిలబడ్డ ప్రతీచోటా గెలవాల్సిందే. కసరత్తులు చేశారు. కత్తులు నూరుతున్నారు. ఇక యుద్ధమే తరువాయి....

టార్గెట్‌ 16 నిలబడ్డ ప్రతీచోటా గెలవాల్సిందే. కసరత్తులు చేశారు. కత్తులు నూరుతున్నారు. ఇక యుద్ధమే తరువాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు గులాబీ పార్టీ సర్వం సిద్ధమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే గ్రౌండ్‌ ప్రిపరేషన్‌ పూర్తి చేసుకున్న టీఆర్ఎస్‌ ఇక ప్రచారపర్వంలోకి దూకుతోంది. ఇవాళ్టి నుంచి అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాలను చుట్టేసేందుకు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కారెక్కేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అసెంబ్లీని చేజిక్కించుకున్నారు ఇక లోక్‌సభను దక్కించుకునేందుకు సమరానికి సిద్ధమవుతున్నారు గులాబీ లీడర్లు. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్‌ కీలకపాత్ర పోషించబోతోందని అందుకే 16 సీట్లలో గెలిచితీరాల్సిందే అంటూ ప్రకటనలు చేసిన టీఆర్ఎస్‌ అందుకు తగ్గట్లు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కూటములుకు పూర్తి మోజార్టీ వచ్చే అవకాశం లేదని ప్రభుత్వ ఏర్పాటులో తమ బలం కూడా కీలకం అవుతుందని భావిస్తున్న గులాబీ పెద్దలు తెలంగాణలో 16 చోట్ల గెలుపే లక్ష్యంగా ప‌నిచేస్తున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే తాజాగా లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అంతర్గత సర్వేతో పాటు ఇతర పార్టీల బలబలాలు, అభ్యర్దులుకు ప్రజల్లో ఉన్న ఆదరణపై అంచనాకు వచ్చిన నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమతువున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పకడ్బందీ ప్రణాళికతో నియోజకవర్గాల్లో పర్యటించేందుకు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం మొదటి సన్నాహక సమావేశం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు.

మార్చ్ 6 కరీంనగర్, 7 న ఉద‌యం వరంగల్, మ‌ధ్యాహ్నం భువ‌న‌గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సన్నాహక సమావేశం నిర్వహిస్తారు. 8 న ఉదయం మెద‌క్, అదే రోజు మధ్యహ్నం మ‌ల్కాజ్ గిరి, 9 వ తేదీన ఉదయం నాగర్ కర్నూల్, మధ్యాహ్నం రెండున్నర గంట‌ల‌కు చేవేళ్ళ‌ నియోజకవర్గాలను చుట్టేస్తారు. ఈ నెల 17 న నల్గొండ, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలతో ఈ టూర్‌ ముగియనుంది.

ముఖ్యంగా ఈ సమావేశాల్లో పార్లమెంట్ నియోజకవర్గం పరిదిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోని ముఖ్యనేతలను అహ్వానించారు. నాయకుల మద్య సమన్వయం, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు కౌంటర్ వ్యూహం అమలు చేయడం వంటి వాటిపై చర్చిస్తారు. అలాగే ప్రజల నుంచి వస్తున్న సమస్యలపై ఫోకస్ చేస్తారు.


లైవ్ టీవి


Share it
Top