Top
logo

కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాం ‌: కేటీఆర్

కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాం ‌: కేటీఆర్
X
Highlights

టీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బిజెపికి ఓటేస్తే మోడీకి...

టీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బిజెపికి ఓటేస్తే మోడీకి లాభం కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాహుల్‌కు లాభమన్నారు. గత ఐదేళ్లలో కేసీఆర్ మైనారిటీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన మైనారిటీల సభలో కేటీఆర్ పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను యావత్‌ దేశం ప్రశంసిస్తోంది. ఎన్నికల సమయంలోనే మోదీకి దేవుడు, ప్రజలు గుర్తుకు వస్తారు. ఆనాడు ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్‌ 16 మంది ఎంపీలను గెలిపిస్తే బంగారు తెలంగాణ సాధిస్తారు. పేద ఆడబిడ్డ పెండ్లికి షాదీ ముబారక్‌ పథకం ద్వారా రూ.లక్షా 116 అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 206 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశామని కేటీఆర్‌ తెలిపారు.

Next Story