Top
logo

వీర జవాన్లకు కేటీఆర్ నివాళి..రూ. 25 లక్షల ఆర్థికసాయం

వీర జవాన్లకు కేటీఆర్ నివాళి..రూ. 25 లక్షల ఆర్థికసాయం
X
Highlights

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి యావత్తు...

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి యావత్తు భారతావణి అండగా నిలుస్తోంది. భారీగా విరాళాలు అందజేస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చేరారు. ప్రభుత్వం నుంచో, పార్టీ ఫండ్ నుంచో కాకుండా తన సంపాదనలో 25 లక్షల రూపాయలను కేటీఆర్ విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్‌లోని సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ హెడ్ క్వార్టర్‌ను సందర్శించిన కేటీఆర్.. పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. అనంతరం రూ.25 లక్షల చెక్‌ను ఉన్నతాధికారులకు అందజేశారు.

Next Story