జగన్‌తో కేటీఆర్ భేటీ... రిటర్న్ గిఫ్టులో భాగమేనా?

జగన్‌తో కేటీఆర్ భేటీ... రిటర్న్ గిఫ్టులో భాగమేనా?
x
Highlights

ఎన్నికల సమీపిస్తున్న వేళ రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికి , చర్చకు దారితీసింది.

ఎన్నికల సమీపిస్తున్న వేళ రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికి , చర్చకు దారితీసింది. అయితే వైసీపీ ఫెడరల్ ఫ్రంట్ లో చేరడంపై చర్చలు జరిపిినట్లు చెబుతున్నాఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా మంతనాలు సాగించినట్లు సమాచారం. మొత్తానికి జగన్-కేటీఆర్ భేటీ ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా హీట్ పెంచేసింది.

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం హైదరాబాద్‌లో సమావేశం అయ్యింది. లోటస్ పాండ్‌ జగన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ ‌తో పాటు పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ తరపున విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీఆర్ఎస్ తరుపున ఎంపీలు వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి ఉన్నారు. వీరి లంచ్ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. సమావేశం ముగిశాక జగన్-కేటీఆర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి వైసీపీ అధినేత జగన్‌తో మరిన్ని చర్చలు ఉంటాయని కేటీఆర్ ప్రకటించారు. కేసీఆర్ త్వరలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళి స్వయంగా జగన్‌తో చర్చిస్తారని ప్రకటించారు.

ఫెడరల్ ప్రంట్‌లో వైసీపీ చేరే అంశంపై పార్టీ నేతలలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి ఏర్పాటు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు జగన్. పార్లమెంటు వేదికగా ఇచ్చాన హామీలకు దిక్కూ మొక్కూ లేకుండా పోయిందని జగన్ వ్యాఖ్యానించారు. 25 మంది ఏపీ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం కష్టమన్న జగన్ ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ ఎంపీలతో కలసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై టీఆర్ఎస్ మొదటి నుంచి సానుకూల వైఖరితోనే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటు వేదికగా టీఆర్ఎస్ తన అభిప్రాయాన్ని చెప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించడం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యలు చేసిన తర్వాత జరిగిన జగన్‌, కేటీఆర్ భేటీ. రాజకీయాల్లో కాక రేపుతోంది. పైగా కేసీఆర్‌ ఏపీకి వెళ్ళి మరీ జగన్‌ తో చర్చలు జరపుతారని ప్రకటించడం మరింత హీట్ రాజేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories