వైఎస్‌ జగన్‌తో కేటీఆర్‌ భేటీ

వైఎస్‌ జగన్‌తో కేటీఆర్‌ భేటీ
x
Highlights

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఫెడరల్‌ ఫ‌్రంట్‌కు పునాదులు వేస్తున్న కేసీఆర్‌ ఏపీ నుంచే తన ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. ఎన్డీఏ, యూపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చర్యలు ముమ్మరం చేశారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఫెడరల్‌ ఫ‌్రంట్‌కు పునాదులు వేస్తున్న కేసీఆర్‌ ఏపీ నుంచే తన ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. ఎన్డీఏ, యూపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏపీలో వైసీపీతో జతకడుతున్నారు. ఫెడరల్‌తో కలిసి రావాలని కేసీఆర్‌ కేటీఆర్‌తో జగన్‌కు రాయబారం పంపారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌ను నివాసానికి వెళ్లిన కేటీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి ఆహ్వానించారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి వైసీపీని ఆహ్వానించేందుకు కేసీఆర్‌ టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను జగన్‌ నివాసానికి పంపించారు. కేసీఆర్‌ ఆదేశాలతో లోటస్‌పాండ్‌కు వెళ్లిన కేటీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌పై జగన్‌తో చర్చించారు. ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు వినోద్‌, సంతోష్‌, టీఆర్ఎస్‌ కార్యదర్శి పల్లా రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పీడ్‌ పెంచారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి వైసీపీని ఆహ్వానించాలని నిర్ణయించిన కేసీఆర్‌ జగన్‌తో చర్చలు జరపాలని కేటీఆర్‌ను ఆదేశించారు. టీఆర్ఎస్‌తో వైసీపీ దోస్తీ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనే కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌ జగన్‌తో సమావేశం నిర్వహించరంటూ టీడీపీ ఆరోపిస్తోంది. జగన్‌, కేసీఆర్‌, మోడీ ముగ్గురూ ఒకే జట్టని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories