కేటిఅర్ ఫెయిల్ హరీష్ సక్సెస్ .. టీఆర్ఎస్ లో కొత్త చర్చ ..

కేటిఅర్ ఫెయిల్ హరీష్ సక్సెస్ .. టీఆర్ఎస్ లో కొత్త చర్చ ..
x
Highlights

"కారు -సారు-సర్కారు " అని యామ జోరుగా ముందుకు వెళ్ళింది టీఆర్ఎస్ .. అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన ఉపుతో మిత్రపక్షంతో కలిపి పదహరుకు పదహరు స్థానాలను కైవసం...

"కారు -సారు-సర్కారు " అని యామ జోరుగా ముందుకు వెళ్ళింది టీఆర్ఎస్ .. అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన ఉపుతో మిత్రపక్షంతో కలిపి పదహరుకు పదహరు స్థానాలను కైవసం చేసుకోవాలని భావించిన కేసీఆర్ కి గట్టి షాక్ తగిలింది .. పదహరుకి బదులు తొమ్మిది స్థానాలను మాత్రమే టీఆర్ఎస్ కైవసం చేసుకుంది . ఇందులో నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోవడం నిజంగా ఇటు కేసీఆర్ అటు కేటిఅర్ జీర్ణించుకోలేని విషయం..

దీనికి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతే కారణం అనుకుంటే పొరపాటే సరిగ్గా వ్యుహరచన లేకపోవడమే అసలైన కారణం.. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 88 స్థానాలను దక్కించుకుంది . ఈ విజయంలో హరీష్ రావు పాత్ర కీలకం.. కాంగ్రెస్ ఉద్దండులు అని చెప్పుకునే నేతలను ఓడిపోవడంలో హరీష్ రావుది కీలకపాత్ర .. ఇక రేవంత్ రెడ్డి ఓటమిలో హరీష్ రావు ట్రబుల్ షుటర్ గా ఫుల్ సక్సెస్ అయ్యాడు ..

ఇక ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి భాద్యత మొత్తం తన మీదా వేసుకున్నారు కేటిఅర్ ..అభ్యర్ధుల ఎంపిక నుండి ప్రచార భాద్యతలు మొత్తం ఆయనే తీసుకున్నారు . హరీష్ రావుని కేవలం మెదక్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేసారు .. మెదక్ నియోజకవర్గంలో మెదక్ అభ్యర్ది కంటే తన నియోజకవర్గంలో ఓ రెండు ఓట్ల మెజారిటి ఎక్కువే తీసుకువస్తానని కేటిఅర్ హరీష్ కి సవాల్ విసిరారు కూడా ..

ఇప్పుడు గెలుపు విషయం పక్కన పెడితే టీఆర్ఎస్ కి కంచుకోట అని చెప్పుకునే కరీంనగర్ ఓడిపోయింది .. మెదక్ నియోజకవర్గ అభ్యర్ది మూడు లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు .. ఒకవేళ మొత్తం భాద్యతలు హరీష్ రావు పైనే పెట్టుంటే టీఆర్ఎస్ పదహరుకు పదహరు స్థానాలను ఇట్టే గెలుచుకునేది అని పలువురు రాజకీయ విశ్లేక్షకులు భావిస్తున్నారు ...

Show Full Article
Print Article
Next Story
More Stories