కేసీఆర్‌ సొంతంగా పార్టీ పెట్టుకుంటే..చంద్రబాబు మామ పెట్టిన పార్టీని..

కేసీఆర్‌ సొంతంగా పార్టీ పెట్టుకుంటే..చంద్రబాబు మామ పెట్టిన పార్టీని..
x
Highlights

టీడీపీ, టీఆర్ఎస్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. నువ్వొకటంటే నేను రెండంటా అన్నట్టు ఒకరి కామెంట్స్‌కు మరొకరి ఘాటు కౌంటర్‌తో పొలిటికల‌్‌ హీట్‌...

టీడీపీ, టీఆర్ఎస్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. నువ్వొకటంటే నేను రెండంటా అన్నట్టు ఒకరి కామెంట్స్‌కు మరొకరి ఘాటు కౌంటర్‌తో పొలిటికల‌్‌ హీట్‌ పెంచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ వార్‌ తారస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ, టీఆర్ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ సొంతంగా పార్టీ పెట్టుకుంటే చంద్రబాబు తన మామ పెట్టిన పార్టీని గుంజుకున్నారని ఎద్దేవా చేశారు. ముసుగులు తీసేసి రావాలంటూ చంద్రబాబు గమ్మత్తుగా మాట్లాడుతున్నారని ముసుగులు, కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబే కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ కేటీఆర్‌ విమర్శించారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. చంద్రబాబుపై కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటే ఆ వ్యాఖ్యలకు ధీటుగా ఏపీ సీఎం స్పందిస్తున్నారు. కేటీఆర్, చంద్రబాబుల హాట్ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకరిపై ఒకరు చేస్తున్న కామెంట్లను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

కేటీఆర్‌ చేస్తున్న మాటల దాడితో ఏపీ సీఎం చంద్రబాబు చికాకు చెందుతున్నారు. ఈ విషయమై క్యాబినెట్‌ సమావేశంలో చర్చించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రులెవరూ ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌పై చంద్రబాబు చేస్తున్న విమర్శలను కేటీఆర్‌ అంతే వేగంగా, ఘాటుగా స్పందిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ మాటల యుద్ధం మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories