Top
logo

హరీశ్‌కు సవాల్‌ విసిరిన కేటీఆర్‌

హరీశ్‌కు సవాల్‌ విసిరిన కేటీఆర్‌
X
Highlights

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌...

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు సవాల్‌ విసిరారు. ఈరోజు టీఆర్ఎస్ మెదక్ లోక్ సభ నియోజకవర్గ కార్తకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ...బావా, బావమరదులకు ఏమీ కాలేదని ఇద్దరం బాగున్నామని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ఎంపీ స్థానం కంటే మెదక్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజర్టీటీ సాధించాలని హరీష్ కు ఇదే తన సవాల్ అని చెప్పారు. మెదక్ కంటే కనీసం రెండు ఓట్లైనా తాము ఎక్కువ తెచ్చుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Next Story