logo

కర్నాటకలోనూ ఘనంగా శివరాత్రి వేడుకలు

కర్నాటకలోనూ ఘనంగా శివరాత్రి వేడుకలు

కర్నాటక రాష్ర్టం కోలారు జిల్లా కమ్మ సంద్రంలోని కోటిలింగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడి ఆలయంలోని 108 అడుగుల మహాశివలింగం 30 అడుగుల నంది విగ్రహనికి భక్తులు పూజలు చేశారు. దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయాలు ఒకే చోట ఉన్నాయి. ఇదే ఆలయంలో ఇప్పటి వరకు 98 లక్షల శివలింగాలను ప్రతిష్టించారు. ఈ ఆలయంలో జరుగుతున్న పూజల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top