Top
logo

పొత్తులతో నష్టపోయాం..నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తా

పొత్తులతో నష్టపోయాం..నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీ  చేస్తా
X
Highlights

ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పొత్తులతోనే తీవ్ర్గంగా నష్టపోయామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పొత్తులతోనే తీవ్ర్గంగా నష్టపోయామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాను మొదటి నుంచి కూడా పొత్తులు వద్దని చెప్పానని అయినా మా వాళ్లు వినిపించుకోలేదని అన్నారు. టీడీపీకీ నామమాత్రపు కేడరే ఉందని, పొత్తు వల్ల ఉద్యోగులు, యువత తమ పార్టీకి దూరమయ్యారని కోమటిరెడ్డి విమర్శించారు. తెలంగాణలో ప్రజాకూటమి గెలిస్తే చంద్రబాబు ప్రాధాన్యత ఉంటుందని తెరాస పార్టీ చెప్పిన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున 45సీటైనా గెలుస్తామని అనుకున్నాం కాని పొత్తు వల్ల ఘోరాతిఘోరంగా ఓడిపోయామని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూటమితో పొత్తు లేకుంటే కనీసం 7సీట్లైనా గెలుస్తామని పార్టీ అగ్రనేతలకు చెప్పానని అన్నారు. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Next Story