ఉసురు తీస్తున్న పసరు

ఉసురు తీస్తున్న పసరు
x
Highlights

వాళ్లకు ఆకు పసరే సంజీవని వడ దెబ్బ తగిలినా, కడుపు నొప్పి వచ్చినా ఆఖరికి కంట్లో నలుసు పడినా ఆకు పసరే సర్వరోగ నివారిణిగా వారు భావిస్తారు అయితే ఆ ఆకు పసరే...

వాళ్లకు ఆకు పసరే సంజీవని వడ దెబ్బ తగిలినా, కడుపు నొప్పి వచ్చినా ఆఖరికి కంట్లో నలుసు పడినా ఆకు పసరే సర్వరోగ నివారిణిగా వారు భావిస్తారు అయితే ఆ ఆకు పసరే ప్రాణాలను తీస్తుందని వారు కలలో కూడా ఊహించలేదు గిరిజనుల ప్రాణాలు తీస్తున్న ఆకు పసర వైద్యంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

కుమ్రంబీమ్ జిల్లా జైనూరు మండలంలోని బూసిమెట్టు గ్రామం ఈ మారు మూల గిరిజన గ్రామంలో ఏ రోగం వచ్చినా ఆకు పసరే వీరికి సర్వరోగ నివారిణి అన్నిటికీ అదే మందని భావిస్తుంటారు అయితే ఈ ఆకు పసరు ఓ కుటుంబంలో విషాదం నిపింది ఒకరు మృతికి కారణమైంది బూసిమెట్ట ఆత్రం తుర్జబాయికి ఏడుగురు సంతానం అందులో చిన్నవాడైన అనిల్‌ భార్య రంభకు వడదెబ్బ తగిలి ఇబ్బంది పడుతోంది. నిరసంగా ఉండటంతో అనిల్ ఆకుపసరు మందు నూరి తాగేందుకు మంగళవారం సిద్ధం చేశారు.

ఇదే క్రమంలో అత్త తుర్జబాయి సైతం ఆరోగ్యం బాగలేదని ఆకుపసరు మందు తాగింది మందు కాస్త తేడాగా ఉందని కొడుకుకు చెప్పగా అతను కూడా ఆ పసరును తాగాడు దీంతో ముగ్గురూ అస్వస్థకు గురయ్యారు పసరు తాగిన కొద్ది సేపటికే వారు స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన చుట్టుపక్కల బంధువులు అపస్మార స్థితిలో పడి ఉన్న ముగ్గురిని చికిత్స నిమిత్తం జైనూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సలు చేసి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో తుర్జబాయి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందగా. కోడలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొడుకు పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఆకుపసర మందు వికటించిందా లేదా అందులో పురుగుల మందు ఏమైనా కలిసిందా కలిపారా అనే కోణంలో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. తుర్జబాయి మృతదేహనికి శవపరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ సాదిక్‌పాషా తెలిపారు. మరోవైపు సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నామని గిరిజనులు అంటున్నారు తమను సర్కారు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories