కోడి రామకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రాలివే...

కోడి రామకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రాలివే...
x
Highlights

విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడిగా పేరుగాంచిన కోడి రామకృష్ణది చిత్రరంగంలో 30 యేళ్ల ప్రస్థానం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో...

విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడిగా పేరుగాంచిన కోడి రామకృష్ణది చిత్రరంగంలో 30 యేళ్ల ప్రస్థానం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన రామకృష్ణ దాసరి నారాయణ రావు శిష్యుడిగా చిత్రరంగంలో అడుగుపెట్టారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన ఆయన వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. మెగాస్టార్‌ చిరంజీవితో కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య వీదిలో కృష్ణయ్య తీశారు. మొదటిసినిమానే ఏకంగా 525 రోజులు ఆడింది.

తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు రూపొందించిన ఆయన తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2016 లో కన్నడలో వచ్చిన నాగహారవు అనే చిత్రానికి చివరగా దర్శకత్వం వహించారు. అంతేకాదు.. విలక్షణమైన నటులను పరిచయం చేసిన ఘనత ఈయనకే దక్కింది. గొల్లపూడి మారుతిరావు, ఆహుతి ప్రసాద్‌, కాస్ట్యూమ్స్‌ కృష్ణ, రామిరెడ్డి వంటి డిఫ్‌రెంట్‌ ఆర్టిస్టులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలు...అంకుశం, అరుంధతి, దేవి, పుట్టింటికి రా చెల్లి, మంగమ్మగారి మనవడు, రిక్షావోడు, తలంబ్రాలు, దేవీపుత్రుడు, శ్రీనివాస కళ్యాణం, భారత్ బంద్, ముద్దుల మావయ్య, అమ్మోరు, ఆహుతి, ముక్కుపుడక, ముద్దుల కృష్ణయ్య, దేవుళ్లు, స్టేషన్‌ మాస్టర్‌, చుట్టాలబ్బాయి, బాలగోపాలుడు, సోగ్గాడికాపురం, 20వ శతాబ్దం, పెళ్లాం చెబితే వినాలి, రాజధాని, పోలీస్‌లాకప్‌, గాడ్‌ఫాదర్‌, పెళ్లి, పెళ్లిపందిరి, పెళ్లికానుక, పంజరం, అంజి లాంటి చిత్రాలకు దర్శకుత్వం వహించారు. 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కోడిరామకృష్ణ అందుకున్నారు. 10 నంది అవార్డులు, 2 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. శత్రువు సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories