అందుకే తెలంగాణ జన సమితి ఏర్పాటు చేశాం: కోదండరాం

అందుకే తెలంగాణ జన సమితి ఏర్పాటు చేశాం: కోదండరాం
x
Highlights

తెలంగాణలో నిర్బంధాన్నిఎదిరించడానికే . తెలంగాణ జన సమితి ఏర్పాటు చేశామన్నారు ప్రొఫెసర్ కోదండరామ్‌. నిర్బంధాల మధ్య తొలి వ్యవస్ధాపక దినోత్సవం జరుగుతుందని...

తెలంగాణలో నిర్బంధాన్నిఎదిరించడానికే . తెలంగాణ జన సమితి ఏర్పాటు చేశామన్నారు ప్రొఫెసర్ కోదండరామ్‌. నిర్బంధాల మధ్య తొలి వ్యవస్ధాపక దినోత్సవం జరుగుతుందని తాను ఊహించలేదన్నారు. గడిచిన కాలమంతా ఉద్యమాలతోనే సాగిందన్న ఆయన ఉద్యమ ఆకాంక్షల కోసం అనునిత్యం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఇంటర్ విద్యార్ధుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి అత్యంత హేయనీయంగా ఉందన్నారు. తప్పు చేసిన అధికారులు, నేతలను వదిలి పెట్టి అభం, శుభం తెలియని విద్యార్ధులు దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్బంధం కారణంగా తన ఇంట్లోనే టీజేఎస్‌ ఆవిర్భావ వేడుకలను ఆయన జరుపుకున్నారు. తన ఇంటిపై టీజేఎస్‌ జెండా ఎగరవేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని టీజేఎస్ అధినేత కోదండరాం డిమాండ్ చేశారు.మృతిచెందిన విద్యార్థుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కేసీఆర్‌ తీరు రోమ్‌ చక్రవర్తిలా ఉందని కోదండరామ్ ఆరోపించారు. అరెస్ట్‌లు చేస్తామని, న్యాయం చేయం అంటున్నారని కోదండరాం దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories