వివాదాస్పద పాటకు స్టెప్పులేసిన కోదాడ ఎమ్మెల్యే

వివాదాస్పద పాటకు స్టెప్పులేసిన కోదాడ ఎమ్మెల్యే
x
Highlights

వివాదాస్పద పాటకు స్టెప్పులేశారు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఇవాళ ఆయన కూతురు పెళ్లి సందర్భంగా కోదాడలో భార్యతో కలిసి చిందేశారు. గొల్ల మల్లమ్మ...

వివాదాస్పద పాటకు స్టెప్పులేశారు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఇవాళ ఆయన కూతురు పెళ్లి సందర్భంగా కోదాడలో భార్యతో కలిసి చిందేశారు. గొల్ల మల్లమ్మ అనే పాట విడుదల సందర్భంగా ఇది గొల్ల కులాన్ని, గొల్ల కులాల ఆడపడుచులను కించపరిచే విధంగా ఉందని, తక్షణమే నిషేధించాలని రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సంఘాల ఆధ్వర్యంలో 2008లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అప్పట్లో పలుచోట్ల సీడీ షాపుల విధ్వంసం జరిగింది. దీంతో ఈ పాటను ప్రభుత్వం నిషేధించింది. కానీ, తమ సంతోషాలకు మల్లయ్య యాదవ్ మైమరిచిపోయి అదే పాటకు చిందేశారు. ఇది ఇప్పుడు ఆ సామాజికవర్గంలో పెద్ద దుమారాన్ని రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories