logo

అసెంబ్లీ టికెట్ వచ్చె.. ఓటు లేకపాయె!

అసెంబ్లీ టికెట్ వచ్చె.. ఓటు లేకపాయె!
Highlights

ఒక రాజకీయ పార్టీ టికెట్ దక్కించుకోవాలంటే ఎన్నో పాట్లు, ముప్పు తిప్పలు, పార్టీ నేతలను బుజ్జగించడం, విమర్శలను...

ఒక రాజకీయ పార్టీ టికెట్ దక్కించుకోవాలంటే ఎన్నో పాట్లు, ముప్పు తిప్పలు, పార్టీ నేతలను బుజ్జగించడం, విమర్శలను మూటకట్టుకోవడం, అంతకుమించి కేటాయించే సమయం, అంతా ఇంతా కాదు. అయితే మొత్తానికి పార్టీ టిక్కెట్ దక్కించుకోవడం అంటే జీవన్మరణ సమస్యలా ఉంటుంది. అలాంటిది హైదరాబాద్‌లో సాదాసీదా కొలువు చేస్తున్న ఆమెకి నక్కతోక తొక్కినట్లైంది. అదృష్ఠం ఆమె కొంగులో పడింది. ఇక ఆ ఆనందంలో ఎగిరి గంతేసింది. సంబురం అంబురాన్ని తాకింది. అంగు అర్భాటలతో మందిని వెంట పెట్టుకొని డొలు సప్పుళ్లతో నామినేషన్ వెసేందుకు వెళ్లింది. తీరా నామినేషన్ వేసేందుకు వెళ్లికి ఆమేకు అదృష్టం గద్దలా తన్నుకపోయేంత పనైంది. తీరా అక్కడ తనకు ఓటు హక్కే లేదని తెలిపోయింది. ఇంగ ఇంకేముంది ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

ఏపీ సర్వాత్రికంలో ఇలాంటి విచిత్రఘటన ఒకటి నమోదైంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా కొచ్చర్ల రమాదేవిని ఎంపిక చేసింది జనసేన అధిష్ఠానం. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న రమాదేవిని తమ పార్టీ అభ్యర్థిగా జనసేన ప్రకటించింది. కానీ నామినేషన్ వేసే సమయంలోనే అసలు ఏపీలోనే ఆమేకు ఓటు హక్కు లేదని తెలిపాయే. కాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీని కలిసి తన ఓటును హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా మాచర్ల మండలం వెల్దుర్తికి మార్చాలని విన్నబుచ్చుకున్నారు. అయితే ఆ అవకాశం ప్రస్తుతం లేదని ద్వివేదీని చెప్పేశారు. అయిన కానీ ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని తెలిపారు. ఎంత నక్కతోక తొక్కితే ఏం లాభం దేనికైనా రాశిపెట్టిఉండాలని అనే సమేత గుర్తోస్తుంది. అంతే కదా!

లైవ్ టీవి

Share it
Top