ఈ నెల 13 నుంచి స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్

ఈ నెల 13 నుంచి స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్
x
Highlights

తెలంగాణలో నాల్గవ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వాహణకు పర్యాటక శాఖ సిద్ధమయ్యింది. ఈనెల 13 నుంచి 15 వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేట్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ తోపాటు

తెలంగాణలో నాల్గవ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వాహణకు పర్యాటక శాఖ సిద్ధమయ్యింది. ఈనెల 13 నుంచి 15 వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేట్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ తోపాటు స్వీట్స్ కూడా నిర్వహించాలని భావిస్తోంది. కేరళ, బెంగాళి, అసోమ్, మిజోరామ్, పంజాబ్ రాష్ర్టాలకు చెందిన మహిళలు సొంతంగా తయారు చేసిన స్వీట్లతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఈసారి అత్యంత ఆకర్షణీయంగా ఉండబోతుందని తెలిపారు. భారతదేశ సంస్కృతిని చాటే విధంగా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఫెస్టివల్ ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే గత ఏడాది కైట్, స్వీట్ పండుగలకు 7 లక్షల మంది వచ్చారని, ఈ ఏడాది కూడా 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories