కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి.. నేడే ప్రమాణం..

కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి.. నేడే ప్రమాణం..
x
Highlights

మోడీ-2 కేబినెట్‌లో తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డికి బెర్త్ దక్కింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు ఫోన్ చేసి మంత్రిగా ప్రమాణం చేయడానికి ఇవాళ...

మోడీ-2 కేబినెట్‌లో తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డికి బెర్త్ దక్కింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు ఫోన్ చేసి మంత్రిగా ప్రమాణం చేయడానికి ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు రావాలని చెప్పారు. కిషన్‌రెడ్డికి మంత్రి పదవి రావడంతో తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి అనుచరులు నిన్నటి నుంచే ఢిల్లీలో ఉండి తమ నేతకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డికి రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడుగా పనిచేశారు. తర్వాత తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఆయనకు మోదీ మంత్రి పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎన్డీయే ప్రభుత్వంలో ప్రధాని మోదీ 60 మంది మంత్రులను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ చీఫ్‌గా అమిత్ షా కొనసాగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, జార్ఖాండ్, హర్యానా, బెంగాల్, డీల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ చీఫ్‌గా అమిత్ షా కొనసాగుతానంటున్న అమిత్ షా. కానీ కేబీనెట్ అమిత్ షా ఉంటే బాగుంటుందన్న నరేంద్రమోడీ. ఒకవేళ షా మంత్రి బాధ్యతలు చేపడితే హోం లేదా రక్షణ శాఖల్లో ఏదో ఒకటి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా విదేశాంగ మంత్రిగా పర్‌ఫెక్ట్‌గా పనిచేసిన సుష్మాస్వరాజ్‌ను మళ్లీ తీసుకుంటారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మధ్యాహ్నం తరువాత కొత్త మంత్రులకు ఫోన్లు చేయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories