ఎన్నికలకు ముందే వైసీపీలోకి కృపారాణి...టెక్కలి, పలాసలో ఏదో ఒకదాని నుంచి పోటీ ?

ఎన్నికలకు ముందే వైసీపీలోకి కృపారాణి...టెక్కలి, పలాసలో ఏదో ఒకదాని నుంచి పోటీ ?
x
Highlights

రాష్ట్ర విభజనతో ఉనికిని కోల్పోయిన ఎపి కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగలనుందా? ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్న సిక్కోలు కాంగ్రెస్ నేతలు పార్టీ...

రాష్ట్ర విభజనతో ఉనికిని కోల్పోయిన ఎపి కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగలనుందా? ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్న సిక్కోలు కాంగ్రెస్ నేతలు పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారా? జిల్లాలో పార్టీ వీడే యోచనలో ఉన్న ఆ మాజీ కేంద్రమంత్రి ఎవరు? ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్ నాయకులతో ఆసక్తికరంగా మారుతున్న సిక్కోలు రాజకీయాలపై స్పెషల్ స్టోరీ.

ఉద్యమాలఖిల్లా సిక్కోలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ టీడీపీకి ధీటైన సమాధానం ఇవ్వటానికి ప్రతిపక్షపార్టీలు పావులు కదుపుతున్నాయి. బలమైన అధికార పార్టీ నేతలని డీ కొట్టడానికి అదే స్థాయి కలిగిన గెలుపు గుర్రాలను బరిలో దించటానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కింజరాపు అచ్చెన్నాయుడు నియోజకవర్గంపై వైసీపీ కన్నేసినట్టు కనిపిస్తోంది.

2014 ఎన్నికల ముందువరకూ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో విభజన తర్వాత ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. జిల్లాలోని పార్టీ పరిస్ధితిని గమనించిన సీనియర్లంతా ముందే తట్టా బుట్టా సర్ధుకున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో కృపారాణి ఒక్కరే ఒంటరి పోరు సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె కూడా పార్టీ వీడుతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ధర్మాన అండదండలతో రాజకీయంగా ఎదిగిన కృపారాణి ఎన్నికలకు ముందే వైసీపీ లోకి వెళ్తారని చెబుతున్నారు. ఈ విషయంలో జగన్‌తో చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే సీటు విషయంలో ఇంకా క్లారిటీ రాని కారణంగానే కృపారాణి వైకాపా తీర్ధం పుచ్చుకోవటం ఆలస్యమౌతోందనే టాక్ వినిపిస్తోంది. తొలుత టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన కృపారాణికి జగన్ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోయే సరికి పలాస నియోజకవర్గానికి షిఫ్ట్‌ అయినట్లు తెలుస్తోంది.

ఈ రెండు నియోజవర్గాల్లో ఏదో ఒక దానిలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు కృపారాణి ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కృపారాణి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుటారని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories