కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన త్రిసభ్య కమిటీ.. శ్రద్ధ ఆసుపత్రి సీజ్‌కు కలెక్టర్ ఆదేశాలు

కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన త్రిసభ్య కమిటీ.. శ్రద్ధ ఆసుపత్రి సీజ్‌కు కలెక్టర్ ఆదేశాలు
x
Highlights

విశాఖలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ కేసులో ఎట్టకేలకు త్రిసభ్య కమిటీ జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇచ్చింది. శ్రద్ధ ఆసుపత్రిని సీజ్ చేయాలని కలెక్టర్...

విశాఖలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ కేసులో ఎట్టకేలకు త్రిసభ్య కమిటీ జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇచ్చింది. శ్రద్ధ ఆసుపత్రిని సీజ్ చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు సీపీ ఏర్పాటు చేసిన సిట్ వివిధ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించనుంది. అవయవ మార్పిడి కేసుల్లో తీగ లాగితే డొంక కదిలింది.

విశాఖ పట్నంలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధ హస్పిటల్ కు షాక్ తగిలింది. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ రిపోర్టు అందించిన తర్వాత కలెక్టర్ భాస్కర్ శ్రద్ధ ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. మరోవైపు అవయవ మార్పిడి కేసుల దర్యాప్తు కోసం పోలీస్ ఆధ్వర్యంలో సీట్ ఏర్పాటైంది. శ్రద్ధ ఆసుపత్రి వ్యవహారంలో 5 పేజీల తో కూడిన 150 రికార్డులను త్రిసభ్య కమీటీ కలెక్టర్ కు అందజేసింది. 2012 నుండి ఇప్పటివరకు 66 కిడ్నీ ఆపరేషన్లు జరిగాయిని, వాటిలో 29 నిబంధనలకు విరుద్దంగా జరిగినట్లు త్రిసభ్య కమిటీ తేల్చింది.

వైజాగ్ లో ప్రయివేట్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలపై ఎంక్వయిరీ చేయాలని పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్రా లడ్డా సిట్ ను ఏర్పాటు చేశారు. ఏపీసీ దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సిట్ పది రోజుల పాటు వివిధ ఆసుపత్రుల్లో విచారణ నిర్వహించి, పది రోజుల్లో రిపోర్టు ఇవ్వనుంది. సిట్ దర్యాప్తుపై ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మరో వైపు నగరంలో ఇప్పటికే కొన్ని హస్పటల్స్ ప అరోపణలు వుండటం, గతంలో కొ్న్ని ఘటనలు వెలుగు చూడడంతో మోత్తం నగరంలో వున్న అన్ని హస్పటల్స్ లలో తనిఖీలు నిర్వహించి రిపోర్టులు ఇచ్చేందుకు పోలిసులు సిద్దమవుతున్నరు. దీంతో నగరంలో పలు హస్పటల్స్ నిర్వహాకుల గుండేల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవయువ మార్పిడి చట్టాలు, ఆర్ధిక లావాదేవీలు, హస్పటల్ నిర్వహాణ, నియమావళి పై సిట్ బ్రుందం దర్యాప్తును కొనసాగించనుంది. మోత్తానికి శ్రద్దా హస్పటల్ వ్యవహారంలో జిల్లా యాంత్రంగం ఒత్తిళ్ల కు తలగొగ్గకుండా పనిచేయడం పై హర్షం వ్యక్తం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories