కిడ్నీ రాకెట్‌పై త్రిసభ్య కమిటీ ఏర్పాటు

కిడ్నీ రాకెట్‌పై త్రిసభ్య కమిటీ ఏర్పాటు
x
Highlights

విశాఖలో కొన్ని హాస్పిటల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. చివరకు రోగులు, వారి బంధువుల కళ్లుగప్పి మరీ డబ్బుల కోసం మోసం చేస్తున్నాయి. కిడ్నీలు...

విశాఖలో కొన్ని హాస్పిటల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. చివరకు రోగులు, వారి బంధువుల కళ్లుగప్పి మరీ డబ్బుల కోసం మోసం చేస్తున్నాయి. కిడ్నీలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. కిడ్నీ రాకెట్‌పై కలెక్టర్ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖలో కిడ్నీరాకెట్ వ్యవహారం సంచలనం సృష్టించింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్ భాస్కర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు శ‌్రద్ధ ఆసుపత్రిలో జరిగిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల తీరుతెన్నులను పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలో డీసీహెచ్ఎస్ నాయక్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున సభ్యులుగా ఉంటారు. ఐదురోజుల్లో విచారణ జరిపి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు, తనకు నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈకేసులో మల్లప్ప మంజునాథ్, బీఎస్ ప్రభాకర్, దొడ్డి ప్రభాకర్, వెంకటేష్ మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మల్లప్ప మంజునాథ్, దొడ్డి ప్రభాకర్‌ను అరెస్టు చేశామని విశాఖ నగర కమిషనర్ మహేష్ లడ్డా చెప్పారు. కిడ్నీరాకెట్ ‌పై నిబంధనలు తుంగలో తొక్కారని ప్రజా వేదిక సంఘ నేతలు మండిపడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories