Top
logo

రణరంగంగా కేరళ

రణరంగంగా కేరళ
Highlights

శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ఎంట్రీ వివాదస్పదంగా మారింది. కనకదుర్గ, బిందు అనే మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై భక్తులు మండిపడుతున్నారు.

శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ఎంట్రీ వివాదస్పదంగా మారింది. కనకదుర్గ, బిందు అనే మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై భక్తులు మండిపడుతున్నారు. తొలిసారిగా ఈ ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధికి చేరుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో పలు ప్రాంతాల్లో అయ్యప్ప భక్తులు నిరసనలకు దిగారు.

శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కనకదుర్గ, బిందు అనే మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై భక్తులు మండిపడుతున్నారు. కేరళ ప్రభుత్వం తీరును నిరసిస్తూ సీఎం పినరయి విజయన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. కేరళలోని హిందూ ఆలయాలపై ఇది బహిరంగ దాడి అనీ.. కేరళతో పాటు దేశం మొత్తానికి ఇది చీకటి రోజు అని మండిపడుతున్నారు. హైదరాబాద్‌లో సైదాబాద్‌కు చెందిన అయ్యప్ప స్వామి దీక్షాపరులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలు అయ్యప్ప సన్నిధికి చేరుకోవడం సరికాదని తప్పుబడుతున్నారు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం శబరిమలను కాపాడుకుందాం అనే నినాదంతో ఆందోళన చేపట్టారు.

మరోవైపు శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఆ ఇద్దరు మహిళలు భక్తులు కాదని, వాళ్లు మావోయిస్టులని బీజేపీ ఎంపీ వి.మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరయి విజయన్, సీపీఎం పార్టీలతో మావోయిస్టులు కుమ్మక్కయ్యారని, హిందూ ఆలయం, స్వామి అయ్యప్ప భక్తులకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు. ఇక కేరళ వ్యాప్తంగానూ ఆందోళనలు మిన్నంటాయి. శబరిమల కర్మ సమితి సహా పలు హిందూత్వ సంస్థలు చేపట్టిన రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పలు పోలీసు వాహనాలతో పాటు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. పోలీసులపైనా దాడులకు దిగడంతో కేరళలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


లైవ్ టీవి


Share it
Top