నల్లగొండ నుంచి పోటీ చేసే యోచనలో కేసీఆర్..?

CM KCR
x
CM KCR
Highlights

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారా ? కాంగ్రెస్‌ కంచుకోటలను దెబ్బ తీయాలంటే తానే బరిలోకి దిగాలని భావిస్తున్నారా ?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారా ? కాంగ్రెస్‌ కంచుకోటలను దెబ్బ తీయాలంటే తానే బరిలోకి దిగాలని భావిస్తున్నారా ? దీని కారణంగానే కుమారుడు కేటీఆర్‌ను సీఎం సీట్లో కూర్చొబెడతారంటూ ప్రచారం జరుగుతోందా ? సీనియర్ నేతలు సైతం కేసీఆర్‌ను పార్లమెంట్‌కు పోటీ చేయాలని కోరుతున్నారా ?

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామంటున్న సీఎం కేసీఆర్ సొంత రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్న కేసీఆర్ తెలంగాణలో 17 ఎంపీ సీట్లను గాను మిత్రపక్షం ఎం‌ఐఎం స్ధానం మినహా మిగిలిన 16 స్ధానాలను కైవసం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారిగా అభ్యర్ధుల బలాబలాలను అంచనా వేసిన ఆయన గెలుపే లక్ష్యంగా అభ్యర్ధులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలంటే ఢిల్లీ వేదిక అవసరమని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ ఎంపిగా బరిలోకి దిగుతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో విసృత చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదే సమయంలో అటు కాంగ్రెస్‌ను దెబ్బతీస్తూ ఇటు టీఆర్ఎస్‌‌‌కు ప్రయోజనం చేకూరేలా ఉండే స్ధానాన్ని కేసీఆర్ ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నల్లగొండ నుంచి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసేందుకు విముఖత చూపుతూ ఉండటంతో ఇక్కడి నుంచే పోటీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.

అయితే ఇలాంటి ప్రచారాలను సీఎం సన్నిహిత నేతలు కొట్టిపడేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టామంటూ చెబుతూనే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఏ మాత్రం లేవంటున్నారు. ఎన్నికల అనంతరం పరిస్ధితుల ప్రభావం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారంటూ చెబుతున్నారు. నేతల ప్రకటనలు ఎలా ఉన్నా కేసీఆర్‌ పోటీ చేసే అంశం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. జాతీయ స్ధాయి కూటమిలో కీలకపాత్ర ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుంచి పోషిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories