విజయమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు

విజయమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు
x
Highlights

జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై టీఆర్ఎస్‌ దృష్టి పెట్టింది. విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌ అధ్యక్షతన ఈ...

జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై టీఆర్ఎస్‌ దృష్టి పెట్టింది. విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, ప్రణాళికపై చర్చించనున్నారు.

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీచేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. ఈ సమావేశానికి దాదాపు 400 మంది పార్టీ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చిస్తారు. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ స్థానాలకు, 5,857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తులపై జరుగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories