త్వరలోనే నిరుద్యోగ భృతి అమలు చేస్తాం: కేసీఆర్

త్వరలోనే నిరుద్యోగ భృతి అమలు చేస్తాం: కేసీఆర్
x
Highlights

రాబోయే నాలుగు లేదా ఐదు నెలల్లోనే తప్పకుండా నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిచారు. నేడు శాసనసభలో కేసీఆర్...

రాబోయే నాలుగు లేదా ఐదు నెలల్లోనే తప్పకుండా నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిచారు. నేడు శాసనసభలో కేసీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి పథకం అమలుకోసమే విధివిధానాలను అధ్యయనం చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. గ్రామాలు,మండలాలు,జిల్లాలు వారీగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నరో వారి యొక్క వివరాలను సేకరిస్తున్నామన్నారు. అభ్యర్థుల కటాఫ్ వయసు ఎప్పటికప్పడు సర్కారుకు తెలియలంటే లెక్క పక్కాగా ఉండాలి. నిరుద్యోగ భృతి విషయంలో తమ ప్రభుత్వం అబద్దాలు చెప్పదలుచుకోలేదు. వచ్చే ఐదు నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిరుద్యోగభృతి పథకం అమలు కోసం రూ. 1,810 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories