Top
logo

ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్‌ సహకరిస్తుంది: కేసీఆర్‌

ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్‌ సహకరిస్తుంది: కేసీఆర్‌
Highlights

ఏపీకి ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్‌ సహకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వికారాబాద్‌ ఎన్నికల...

ఏపీకి ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్‌ సహకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వికారాబాద్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు లాంటి నేతలతో తప్ప ఏపీ ప్రజలతో తమకెలాంటి గొడవల్లేవ్‌ అని తేల్చిచెప్పారు. తెలంగాణ, టీఆర్‌ఎస్ పార్టీ తన మేలుతో పాటు ఇతరుల మేలు కూడా కోరుతది. నీ లాగా పొద్దున్నే లేచి మందికి గోతులు తీయమని తెలంగాణకు కుట్రలు చేయడం రాదు కేసీఆర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకూ తామెప్పుడూ అడ్డురాలేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని ఏపీలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ క్లారిటీ ఇచ్చారు. చెవిలో చెప్పాల్సిన అవసరం తమకు లేదని, బాజాప్తా ఓపెన్‌గానే చెబుతామని, టీడీపీ అధినేత నారా చంద్రబాబులాగా చీకటి పనులు తాము చేయమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ 16 సీట్లు, ఎంఐఎం 1 సీటు గెలవబోతున్నది. ఏపీకి ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.

Next Story