బెజవాడలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ హంగామా!

బెజవాడలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ హంగామా!
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు రిటర్న్ గిఫ్త్ ఇస్తానని...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు రిటర్న్ గిఫ్త్ ఇస్తానని పేర్కొన్నారు. ఈమాటలు అప్పటి నుంచి బాగా వైరల్ అయ్యాయి. అసలు కేసీఆర్ ఎందుకు ఆ మాటలు అన్నారంటే

తెలంగాణలో ఎన్నికల సమయంలో కూటమి పొత్తులో భాగంగా చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు దీంతో దానికి ప్రతిగా తెలంగాణ సీఎంగా గెలుపు సాధించిన వెంటనే కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తానని అన్నారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబును ఏపీలో ఎలాగైన ఓడించాలి అని అనుకున్నారు. అందుకే ముందు నుంచే వైసీపీ అధినేత జగన్‌కి మద్ధతు తెలుపుతూ వచ్చారు.

ఇక కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఏమై ఉంటుంది అని అప్పట్లో విపరీతంగా చర్చ నడిచింది. ఆ మాటపై రాజకీయంగా పెద్ద రచ్చే జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం లోనూ ఈ మాట బాగా ప్రాచుర్యంలో వచ్చింది. ఇపుడు ఏపీ లో వైసీపీ గెలుపుతో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే అని తేలిపోయింది జనాలకు. దీంతో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ క్రేజ్ కూడా ఏపీలో బాగా పెరిగింది. టీడీపీ ఓటమి కోరుకున్నవారంతా కేసీఆర్ అభిమానులుగా మారిపోయారు. మొన్న జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్ళినపుడు బెజవాడలో ఆయనకు స్వాగత ఫ్లేక్సీలు వెలిశాయి. వాటిలో రిటర్న్ గిఫ్ట్ కు ధన్యవాదములు చెప్పినవే ఎక్కువ.

ఒక్కోసారి ఒక్కో నాయకుడు వాడిన మాట ఎంత ప్రాచుర్యంలోకి వస్తుందో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ. మొత్తమ్మీద తన రిటర్న్ గిఫ్ట్ మాటతో ఏపీ లోనూ తనకు అభిమానవర్గాన్ని ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు దక్కిన గౌరవానికి మురిసిపోయారు. అదే ఊపులో కేసీఆర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సంబంధాలు ముందు ముందు మరింత బాగా మెరుగవ్వాలని, వైఎస్ జగన్ సారథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలని మరో 20 ఏళ్ళ వరకు ఏపీకీ జగనే పాలననందించాలని ప్రజలకు చెప్పారు. అంతేకాకుండా తెలుగు ప్రజలు ఆత్మీయతతో ముందుకు సాగి మంచి ఫలితాలను సాధించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories