రైతుకు కేసీఆర్ కాల్‌

రైతుకు కేసీఆర్ కాల్‌
x
Highlights

తాత తండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన భూమి. అయితే భూ ప్రక్షాళనలో మాయమైంది. దీంతో మనస్థాపం చెందిన రైతు తనకు అన్యాయం జరిగింది మహా ప్రభో న్యాయం చేయండంటూ...

తాత తండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన భూమి. అయితే భూ ప్రక్షాళనలో మాయమైంది. దీంతో మనస్థాపం చెందిన రైతు తనకు అన్యాయం జరిగింది మహా ప్రభో న్యాయం చేయండంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాడు. అయినా లాభం లేదు. చివరికి ఇలా కాదు అనుకుని తన మనోవేదనను సోషల్‌ మీడియా ద్వారా తెలియచేశాడు. అది కాస్తా సీఎం కేసీఆర్‌ దగ్గరికి చేరింది. అంతే తక్షణమే ఆ సమస్య పరిష్కారమైంది. రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఓ రైతు తనకు జరిగిన నష్టాన్ని సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తపరిచాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో రైతు ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ రైతు బంధులా శరత్‌ సమస్యను క్షణాల్లో పరిష్కరించారు.

మంచిర్యాల జిల్లా నందుగులపల్లికి చెందిన శరత్ భూమిని మరొకరి పేరు మీద మార్చారు. దీనిపై బాధితుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. కలెక్టర్ కార్యాలయం దగ్గర పడిగాపులు కాసిన సమస్య పరిష్కారం కాలేదు. దీంతో సామాజిక మాధ్యామాల్లో తన ఆవేదన వ్యక్తం చేశాడు శరత్‌. తద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ స్వయంగా శరత్‌తో మాట్లాడారు. తక్షణమే సమస్యను పరిష్కరిస్తానంటూ హామి ఇచ్చారు.

మంచిర్యాల కలెక్టర్‌తో స్వయంగా మాట్లాడిన కేసీఆర్ జరిగిన విషయాన్ని తెలియజేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే నందుగులపల్లి వెళ్లిన కలెక్టర్ రికార్డులను పరిశీలించి స్ధానికులతో మాట్లాడారు. అనంతరం ఏడు ఎకరాల భూమిని శరత్ పేరు మీదకు పట్టా మార్చారు.

సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి సమస్య పరిష్కరించడంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తన భూమిని ఇతరులకు పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories