రెవెన్యూ శాఖలో పెను మార్పులకు రంగం సిద్దం చేస్తూన్న సీఎం కేసీఆర్

రెవెన్యూ శాఖలో పెను మార్పులకు రంగం సిద్దం చేస్తూన్న సీఎం కేసీఆర్
x
Highlights

రెవెన్యూ శాఖలో పెను మార్పులకు రంగం సిద్దం చేస్తూన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు ఉన్నా రెవెన్యూ శాఖ పేరును సైతం మార్చనున్నారు. పార్లమెంట్ ఎన్నికల...

రెవెన్యూ శాఖలో పెను మార్పులకు రంగం సిద్దం చేస్తూన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు ఉన్నా రెవెన్యూ శాఖ పేరును సైతం మార్చనున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రెవెన్యూశాఖపై పూర్తి స్థాయిలో మార్పులు చేయనున్నారు. ఇందుకు గాను కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తునట్లు సీఎం ప్రకటించారు. ప్రజలకు ఇప్పటి వరకు అన్నితానై మమేకమైన రెవెన్యూ శాఖ పేరు కాలం గర్భంలో కలిసిపోనుంది రెవెన్యూ శాఖ పేరు మార్పుతోపాటు దాని పని విధానంలో సమూల మార్పులు చేసేందుకు రంగం సిద్దం చేస్తూన్నారు సీఎం కేసీఆర్.

భూమిశిస్తును ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసిన ప్రభుత్వం గ్రామస్థాయిలో వీఆర్‌ఏ, వీఆర్‌వోల వ్యవస్థను పంచాయతీల్లో కలిపేయాలని భావిస్తోంది. మండల, డివిజన్‌ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను వ్యవసాయ శాఖలో విలీనం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భూముల రిజిస్ట్రేషన్‌ను కూడా పూర్తిస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులకే అప్పగించే అవకాశాలున్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ను పురపాలకశాఖ చేతికి ఇచ్చే అవకాశం ఉంది. జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు కాగానే జూన్‌లోనే రెవెన్యూశాఖను ఇతర శాఖల్లో కలిపే పని చేపడతారని అధికారులు అంటున్నారు.

కేసీఆర్ రెవెన్యూ శాఖ ప్రక్షళనపై ఇప్పటికే రెవిన్యూ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూన్నాయి. సీఎం డైరక్ట్ గా రెవెన్యూశాఖ ను భేకార్ అని అనడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ పేరు కూడా మార్చునున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు సీఎం కేసీఆర్. అసలు ప్రజలతో నిత్యం సంబందాలున్నా రెవెన్యూ డిపార్టుమెంట్ పై సీఎం కేసీఆర్ ఎందుకు కక్షకట్టారో తెలియడం లేదని రెవెన్యూ ఉద్యోగులు వాపోతున్నారు.

రెవెన్యూ శాఖతో ముడిపడిన రైతుల భూ వివాదాలను పరిష్కరించడంతోపాటు వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించారు కేసీఆర్. దీంతో ఇక రెవెన్యూ శాఖ ఉద్యోగులు కేవలం ప్రభుత్వ పథకాలను అమలు, వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు మాత్రమే వారి సేవలు వినియోగించుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories