జగన్ కు కేసీఆర్ అభినందనలు

జగన్ కు కేసీఆర్ అభినందనలు
x
Highlights

లోకసభ ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ఘనవిజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. నరేంద్రమోడీ...

లోకసభ ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ఘనవిజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అద్భుత విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories