తెలంగాణలో మరో 2 కొత్త జిల్లాలు

telangana
x
telangana
Highlights

తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. ములుగు, నారాయణ పేట్ జిల్లాను ఏర్పాటు చేస్తూ కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా ఏర్పడిన 2 జిల్లాలతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33 కు చేరింది.

తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. ములుగు, నారాయణ పేట్ జిల్లాను ఏర్పాటు చేస్తూ కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా ఏర్పడిన 2 జిల్లాలతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33 కు చేరింది.

మహబూబ్ నగర్ జిల్లాలోని 12 మండలాలతో నారాయణపేట్ జిల్లాను , భూపాలపల్లి జిల్లాలోని 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రెవెన్యూ శాఖ ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసింది. నారాయణపేట్ జిల్లాలో నారాయణపేట్ మండలంతో పాటు, దమరుగిద్ద, ధవ్వాడ, మరికల్, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్, ఊట్కూరు, నర్వ, మాగనూరు, కృష్ట, మక్తల్ మండలాలు ఉన్నాయి. 2 మండలలాల జనాభా లెక్కల ప్రకారం నారాయణ పేట్ జిల్లా జనాభా దాదాపు 2 లక్షల, 61 వేలకు పైనే ఉంది.

ఇక ములుగు జిల్లాలో ములుగు మండలంతో పాటు వెంకటాపురం, గోవిందరావు పేట, తాడ్వాయి , ఏటూరు నాగారం, కన్నాయి గూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపూర్ మండలాలు ఉన్నాయి. ఈ 9 మండలాల జనాభా దాదాపు 2 లక్షల 97 వేలుగా ఉంది. రెండు కొత్త జిల్లాలతో పాటు నాలుగు కొత్త మండలాలను ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సిద్దిపెట్ జిల్లాలో నారాయణరావు పేట, నిజామాబాద్ జిల్లాలో మోస్రా, చండూరు, మేడ్చెల్‌లో మూడు చింతలపల్లి మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేశారు.

ముందుగా 8 కొత్త మండలాలను ఏర్పాటు చేయ్యాలని ప్రభుత్వం భావించినా నాలుగు మండలాలకే నోటిఫికేషన్ ఇచ్చారు. మరో 4 మండలాల ఏర్పాటు కోసం ఇంకో నోటిఫికేషన్ వెలువడుతుందని సమాచారం. 2 కొత్త జిల్లాలు, 4 కొత్త మండలాలు ఏర్పాటుపై అభ్యంతరాలు తెలపడానికి జనవరి 31 వరకు ప్రభుత్వం గడువిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories