నేడు తమిళనాడుకి కేసీఆర్ ,రేపు స్టాలిన్ తో భేటి

నేడు తమిళనాడుకి కేసీఆర్ ,రేపు స్టాలిన్ తో భేటి
x
Highlights

ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా ఇప్పటికే కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన తెలంగాణా సీఎం కేసీఆర్ రేపు (సోమవారం) డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్...

ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా ఇప్పటికే కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన తెలంగాణా సీఎం కేసీఆర్ రేపు (సోమవారం) డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తో భేటి కానున్నారు . అందులో భాగంగా కేసీఆర్ ఈ రోజు తమిళనాడుకి వెళ్లనున్నారు . నిజానికి ఈ పర్యటన గత సోమవారం జరగాల్సిందే...

దక్షణాది పర్యటన విషయం గురించి కేసీఆర్ ముందే స్టాలిన్ కి వివరించారు. కానీ అయన ఈ నెల 13న చెన్నైకి రావాల్సిందిగా కోరారు . దీనిపైన ప్రసార మాధ్యమాలలో వివిధ కధనాలను ప్రచురించాయి . దీనితో చెన్నై పర్యటన చాలా ప్రశ్నార్ధకంగా మారింది. ఈ రోజు కేసీఆర్ ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా చెన్నై పర్యటనకు వెళ్తారు ..

అక్కడికి చేరుకున్న తర్వాత శ్రీరంగం , తిరుచ్చి ఆలయాలను సందర్శించుకుంటారు . రాత్రి అక్కడ బస చేసి సోమవారం స్టాలిన్ తో భేటి అవుతారు కేసీఆర్ . ఫెడరల్ ఫ్రంట్ లోని అంశాలపైన, ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల పై అందులో ఫెడరల్ ఫ్రంట్ పోషించావాల్సిన పాత్ర గురించి ఇరువురు చర్చించుకుంటారు . ఇందులో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ పాల్గొనడం లేదని సమాచారం

Show Full Article
Print Article
Next Story
More Stories