మళ్ళీ కేసీఆర్ 6 సెంటిమెంట్...10వ తేదీ కోసం టీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్

మళ్ళీ కేసీఆర్ 6 సెంటిమెంట్...10వ తేదీ కోసం టీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్
x
Highlights

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖారారైందా ? ఆశావాహులపై అవగాహనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ తుది జాబితాను సిద్ధం చేశారా? బడ్జెట్‌ సమావేశాలలోపే కొత్త...

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖారారైందా ? ఆశావాహులపై అవగాహనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ తుది జాబితాను సిద్ధం చేశారా? బడ్జెట్‌ సమావేశాలలోపే కొత్త కేబినెట్ ‌కొలువు తీరనుందా ? మంత్రి వర్గ విస్తరణలో సెంటిమెంట్‌కు మరోసారి ప్రాధాన్యత ఇవ్వనున్నారా ? కేసీఆర్ మనసులో అసలేముంది ?

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖారరైనట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల లోపే మంత్రి వర్గ విస్తరణ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 10న తెలంగాణ కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం మంచి ముహూర్తాల కోసం ఎదురు చూసిన కేసీఆర్ 10 న బలమైన ముహూర్తం ఉండడంతో కేబినెట్‌ను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రతి విషయంలో 6 సెంటిమెంట్‌‌ను ఫాలో అయ్యే కేసీఆర్ కేబినెట్ విస్తరణకు కూడా అదే సెంటిమెంట్‌‌తో రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 10వ తేదీన వచ్చే అంకెలన్నీ కలిపితే 15 అవుతుంది. 15లో ఒకటి ఐదు కలిపితే ఆరు అవుతుంది. అలాగే కేసీఆర్ సీఎం అయ్యాక 60 రోజులకు మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నారు. అంతేకాదు సెంటిమెంట్ ప్రకారం మొత్తం ఆరుగురిని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా టీఆర్ఎస్ నేతలు 60 రోజులుగా ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది.

మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండడంతో కేబినెట్ విస్తరణ జరపాలని యోచిస్తున్నారు. కేబినెట్‌పై కూర్పు జరుగుతోందన్న వార్తలతో టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రి వర్గం రేసులో తమకు చోటు దక్కుతుందో లేదో అని కొందరు ఎదురుచూస్తుంటే మరి కొందరు మాత్రం ఏ శాఖ ఇస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 18 మంది వరకు మంత్రివర్గంలో కొనసాగవచ్చు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌తో పాటు మహమూద్‌అలీ మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన మరో 16 మందిని తీసుకునే వీలు ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తరువాత పూర్తి స్ధాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories