టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌, కేటీఆర్ అభినందనలు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌, కేటీఆర్ అభినందనలు
x
Highlights

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. మూడు స్థానాలకు గానూ టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఏ స్థానంలోనూ ప్రతిపక్ష...

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. మూడు స్థానాలకు గానూ టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఏ స్థానంలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఏకపక్ష విజయం ఇచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బరిలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఇటు వరంగల్‌ జిల్లా టీఆర్ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ జిల్లా టీఆర్ఎస్‌ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి కూడా భారీ విజయం సాధించిన ముగ్గురికి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలుగా గెలుపొందిన చిన్నపరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహేందర్‌రెడ్డిలను కేటీఆర్ ట్విట్టర్‌లో అభినందించారు. గెలుపు కోసం కృషి చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories