క్యాబినెట్ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం...రాష్ట్ర రాజధాని నుంచి....

క్యాబినెట్ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం...రాష్ట్ర రాజధాని నుంచి....
x
Highlights

రాష్ట్ర రాజధాని నుంచి మంత్రి వర్గంలో చోటు ఎవరికి దక్కనుంది. మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాబినెట్ విస్తరణకు కేసీఆర్...

రాష్ట్ర రాజధాని నుంచి మంత్రి వర్గంలో చోటు ఎవరికి దక్కనుంది. మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాబినెట్ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న నేపద్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు తమ అనుచరులతో ఏం చెబుతున్నారు? ఉద్యమకారులకే పదవులివ్వాలని డిమాండ్ చేస్తున్నారా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ కూర్పు పై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ మంత్రి వర్గ కూర్పు , ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యనేతలతో మంతనాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తి అవడంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపద్యంలో ఇక మంత్రి వర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక మంత్రి వర్గంలో చోటు కోసం ఆశావాహులు గత కొంత కాలంగా ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి గెలిచిన ముఖ్యనేతలు మరోసారి తమకు మంత్రి పదువలు వస్తాయనే ధీమాలో ఉన్నారు. గతంలో కంటే ఈసారి గ్రేటర్ పరిధిలో నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపోందడంతో అధినేత ఎవరిని కరుణిస్తారనే చర్చ మొదలైంది. గతంలో గ్రేటర్ పరిదిలో నాయిని నర్శింహా రెడ్డి, మహమూద్ అలీ, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు మంత్రివర్గంలో చోటిచ్చారు కేసీఆర్. అయితే ప్రస్తుతం మహమూద్ అలీ ని మాత్రమే ఇప్పటి వరకు మంత్రి వర్గంలోనికి తీసుకున్నారు. దీంతో ఈసారి మిగతా నేతల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.

అయితే ప్రస్తుతం కేసీఆర్ చేపట్టనున్న మంత్రి వర్గ విస్తరణలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన గెలిచిన తర్వాత కేసీఆర్ ను కలిసి మనసులో మాటను చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు మొదటి నుంచి పార్టీలో కేసీఆర్ విధేయులుగా ఉంటూ వస్తున్నా నాయిని నర్శింహా రెడ్డి, పద్మారావు గౌడ్ తమకు అవకాశం కల్పించాలని అధినేతను కోరుతున్నారు. వారితో ఉద్యమ కాలం నుంచి సహచరులుగా ఉన్న నగర నాయకులు కూడా తన నాయకులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని భాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యమ కాలం నుంచి పార్టీలో అన్ని కష్టనష్టాల్లో వెన్నంటి ఉన్న నేతలు కావడంతో కేసీఆర్ సైతం వీరికి చాన్స్ ఇస్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీనికి తోడు పార్టీ మారి వచ్చిన తలసాని లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెల్తాయని, దానం లాంటి వారు కూడా తనకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉందనే చర్చసైతం జరుగుతోంది. ఈ లాంటి పరిణామాలు పార్టీ పై ప్రస్తుతం కాకపోయినా భవిష్యత్తులో నైనా ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. గ్రేటర్ పరిదిలో పార్టీ బలోపేతం కోసం పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్ నేతలకు మరోసారి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ను కోరుతున్నారు. మొత్తానికి మంత్రి వర్గంలో చోటు కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ఎవరికి క్యాబినెట్ బెర్త్ ఇస్తారోననేది చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories