Top
logo

ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబుకి ఎందుకంత భయం-కర్నె

ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబుకి ఎందుకంత భయం-కర్నె
X
Highlights

ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. కేసీఆర్‌‌పై...

ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. కేసీఆర్‌‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. డేటా చోరీ వ్యవహారంలో ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని కర్నె ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఏ రకంగా వ్యవహరించారో ఈ కేసులో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది టీడీపి నేతల వ్యవహారం.ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు ఎలా ఇచ్చారంటూ తెలంగాణ పోలీస్ లకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.దీంతో పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.ఏం తప్పు చేయనప్పుడు చంద్రబాబుకు భయమెందుకన్నారు. కేసును తమకు అప్పగించాలన్నప్పుడే వాళ్ళు తప్పు చేసినట్లు లెక్క. కేసు బయటికి వస్తే చంద్రబాబు కాళ్ళ కింద మూలాలు కదులుతుందనే భయంతోనే కేసీఆర్ పై మాట్లాడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇతర రాష్ట్రాల నేతలతో ఉన్న సంబంధాలు జగన్ తోను ఉన్నాయి.చంద్రబాబు పాలన బాగా ఉంటే ఇలాంటి చిల్లరమల్లర రాజకీయాలు చేయరని అన్నారు.

Next Story