విపక్షాలకు కర్ణాటక సీఎం ఝలక్‌

విపక్షాలకు కర్ణాటక సీఎం ఝలక్‌
x
Highlights

విపక్షాలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఎగ్జిట్‌ ఫలితాలకు ముందు అన్ని పార్టీలు కలిసినట్లుగానే కనిపించినా ఆ తర్వాతే ఒక్క పార్టీ దూరంగా ఉంటూ...

విపక్షాలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఎగ్జిట్‌ ఫలితాలకు ముందు అన్ని పార్టీలు కలిసినట్లుగానే కనిపించినా ఆ తర్వాతే ఒక్క పార్టీ దూరంగా ఉంటూ వస్తోంది. మాయావతి, స్టాలిన్‌ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా వారి బాటే పట్టారు. ఇవాళ విపక్ష పార్టీలన్నీ కలిసి ఈసీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాలని నిర్ణయించాయి. ఈ కార్యక్రమానికి తొలుత హాజరుకావాలని కుమారస్వామి నిర్ణయం తీసుకున్నారు. అయితే చివరి నిమిషంలో కుమారస్వామి తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై కర్ణాటక సీఎం కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

మొన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా సోనియాతో భేటీ రద్దు చేసుకున్నారు. ఆమె సోనియాతో భేటీ కావడం లేదని బీఎస్పీ నేతలు ప్రకటించారు. ఆ తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్‌ కూడా విపక్షాల సమావేశానికి రాలేనని స్పష్టం చేశారు. ఫలితాలు వెలువడ్డాకే కలిసి మాట్లాడుకుంటే ప్రయోజనం ఉంటుందంటూ ముగించారు. దీంతో విపక్షాల ఐక్యతపై ఓ వైపు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతుంటే తటస్థ పార్టీలు వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో మే 23 తర్వాతే ఏ కూటమిలో చేరాలనే నిర్ణయం తీసుకునే యోచనలో పార్టీలున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories