కరాచీ బేకరీపై పుల్వామా దాడి ఎఫెక్ట్‌

కరాచీ బేకరీపై పుల్వామా దాడి ఎఫెక్ట్‌
x
Highlights

పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ పేరు వింటేనే చాలామంది భారతీయులు రగిలిపోతున్నారు. పాక్‌కు బుద్ది రావాలంటే దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని కొంతమంది రాజకీయ...

పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ పేరు వింటేనే చాలామంది భారతీయులు రగిలిపోతున్నారు. పాక్‌కు బుద్ది రావాలంటే దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని కొంతమంది రాజకీయ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద దేశంలో పుల్వామా దాడి ఎఫెక్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న తరుణంలో కరాచీ బేకరీలకు కూడా ఆ సెగ తగులుతోంది.

బెంగళూరులోని ఓ కరాచీ బేకరీ ఎదుట ఆందోళనకు దిగిన కొంతమంది దాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు. కరాచీ పాకిస్తాన్‌కు చెందిన నగరం కావడంతో కరాచీ బేకరీ ఔట్‌లెట్ అక్కడిదేనని తాము భావిస్తున్నట్టు ఆందోళనకారులు తెలిపారు. దీంతో సదరు బేకరీ యాజమాన్యం సైన్ బోర్డుపై కరాచీ అన్న పదం కనిపించకుండా ఓ బ్యానర్‌తో కవర్ చేసింది.

కరాచీ బేకరీ వ్యవస్థాపకుడైన ఖాన్‌చంద్ రామ్‌నామీ దేశ విభజన సమయంలో పాక్ లోని కరాచీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మొట్టమొదటి కరాచీ బేకరీ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లోని మొజాంజాహి మార్కెట్‌లో ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దేశమంతా వాటిని విస్తరించారు. కరాచీ బేకరీని మూసివేయాలని చేస్తున్నడిమాండ్లను కొందరు ట్విట్టర్ వేదికగా ఖండిస్తున్నారు. పాకిస్తాన్‌లోనూ ముంబై, ఢిల్లీ, కోల్‌కతా పేరిట రెస్టారెంట్స్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories